40 అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌ అరెస్ట్‌

- September 17, 2016 , by Maagulf
40 అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌ అరెస్ట్‌

షార్జా: 40 మంది అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌ని సార్జాలో గడచిన రెండు వారాల్లో అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండడమే వీరి అరెస్టులకు కారణం. షార్జా పోలీసులు మరియు షార్జా మునిసిపాలిటి సంయుక్తంగా ఆకస్మిక దాడులు జరిపి అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌ని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం 33 అక్రమ వెండర్స్‌ని అల్‌ సజ్జా ఇండస్ట్రియల్‌ ఏరియాలో అరెస్ట్‌ చేయడం జరిగింది. షార్జా పోలీసు - కాంప్రహెన్సివ్‌ పోలీస్‌ స్టేషన్స్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ఖలీఫా కలాందర్‌ మాట్లాడుతూ, అక్రమ యాక్టివిస్టుల్ని అరెస్టు చేసేందుకు ఓ ప్లాన్‌ ప్రకారం వ్యవహరించినట్లు తెలిపారు. వీకెండ్స్‌ మరియు సెలవు రోజుల్లో అక్రమ వెండర్స్‌ సంఖ్య బాగా ఎక్కువగా ఉంటున్నారని చెప్పారాయన. ఫేక్‌ గూడ్స్‌, ఫుడ్‌ ఐటమ్స్‌ వంటివాటిని విక్రయించేవారే ఎక్కువ వీరిలో. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆహార పదార్థాలు హానికారకమని అదికారులు తెలిపారు. అరెస్టయినవారిలో ఎక్కువమంది అక్రమ నిర్వాసితులే. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని కల్నల్‌ కలాందర్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com