20 ఏళ్ళ సౌదీ మహిళకు విడాకులు

- September 17, 2016 , by Maagulf
20 ఏళ్ళ సౌదీ మహిళకు విడాకులు

 జెడ్డా: జెడ్డాలోని ఫ్యామిలీ కోర్ట్‌, 20 ఏళ్ళ సౌదీ మహిళకు విడాకులు (ఖులా) రూలింగ్‌ ఇచ్చింది. 50 ఏళ్ళపైన వయసు కలిగిన ఆమె భర్త, ఆమెను శారీరకంగా మానసికంగా హింసిస్తూ వచ్చాడు. అంతే కాకుండా హాషిష్‌ స్మోక్‌ చేయాల్సిందిగా ఆమెను బలవంతపెట్టాడు. బాధిత మహిళ ఈ విషయాల్ని పోలీసులకు తెలిపింది. 80 శాతం ఖులా కేసులు భర్త చేసే డ్రగ్స్‌ వేధింపుల కారణంగానే ఉంటున్నట్లు జ్యుడీషియల్‌ వర్గాల సమాచారాన్ని బట్టి తెలియవస్తోంది. ఇక కేసు విషయానికి వస్తే, స్మోకింగ్‌కి తాను వ్యతిరేకించిన ప్రతిసారీ తీవ్రంగా తనను కొట్టి, వేధించేవాడని ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. భర్త భౌతిక వేధింపులకు సంబంధించి బాధిత మహిళ, మెడికల్‌ సర్టిఫికెట్‌ని కూడా సమర్పించింది. అయితే ముందుగా ఆ హింస విషయంలో బుకాయించిన నిందితుడు, ఆ తర్వాత మెడికల్‌ రిపోర్ట్‌ చూసి, నేరాన్ని ఒప్పుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com