క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది...
- September 17, 2016
విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధిచేసిన సంగతి తెలిసిందే. పోరాట సామర్థ్యం విషయంలో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధనౌకలతో సరితూగుతుందని నౌకా దళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా చెప్పారు. ముంబయిలో శనివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో.. సునీల్ సతీమణి రీనా దీన్ని ప్రారంభించారు.
అనంతరం తొలిసారిగా అరేబియా సముద్రంలోకి దీన్ని పంపారు. సముద్ర పరీక్షలు పూర్తిచేసుకున్న అనంతరం ఇది లాంఛనంగా నౌకాదళంలో చేరుతుంది. 2020-24ల్లో ఇలాంటి మరో నాలుగు నౌకలను సైతం ఎండీఎల్ అభివృద్ధి చేస్తుంది. విశాఖపట్నం తరగతికి చెందిన వీటిలో మొదటి నౌకను గతేడాది ఏప్రిల్ 20న ప్రారంభించిన సంగతి తెలిసిందే.తాజా నౌకను 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్ఠంగా 30 నాట్ల వేగంలో దూసుకెళ్లేలా సిద్ధంచేశారు. ఉపరితలం-ఉపరితలం, ఉపరితలం- గగనతలం క్షిపణులతోపాటు జలాంతర్గామి విధ్వంసక రాకెట్లనూ దీనిపై నుంచి ప్రయోగించే వీలుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







