అమెరికానే ఐఎస్ ను కాపాడుతున్నది!
- September 17, 2016
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సిరియా ఆర్మీ లక్ష్యంగా దాడులు చేసి.. 62మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై రష్యా భగ్గుమంది. అమెరికా విచక్షణారహితంగా సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతున్నదని, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నదని మండిపడింది. ఈ వ్యవహారంపై వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసింది.
'గతంలో అల్ నస్రా దళాన్ని (అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద దళం) అమెరికా రక్షిస్తున్నదేమో అన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజు జరిగిన వైమానిక దాడులతో ఆ అనుమానం పటాపంచలైంది. అమెరికా ఏకంగా ఐఎస్ ను కాపాడుతున్నది' అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో చెప్పారు.
తాజా వైమానిక దాడులపై భద్రతా మండలిలో అమెరికా సమగ్ర వివరణ ఇవ్వాల్సిందేనని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సిరియాలోని డీర్ అల్ జర్ లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో 62మంది సిరియా సైనికులు మరణించారు. 100మందికిపైగా గాయాలయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలను ఏరిపారేస్తున్న సిరియా సేనలు లక్ష్యంగా అమెరికా దాడులు జరుపుతున్నదని, తద్వారా పరోక్షంగా ఐఎస్ కు అమెరికా అండగా నిలబడుతున్నదని రష్యా మండిపడింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









