ఇరాన్‌ సైక్లిస్టు మృతి, పారాలింపిక్స్‌ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి ..

- September 18, 2016 , by Maagulf
ఇరాన్‌ సైక్లిస్టు మృతి, పారాలింపిక్స్‌ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి ..

 రియో డి జెనీరోలో జరుగుతున్న పారాలింపిక్స్‌ రోడ్‌ రేస్‌లో ప్రమాదం చోటుచేసుకుని ఇరాన్‌కి చెందిన సైక్లిస్ట్‌ బాహ్మన్‌ గోల్బార్నిజాద్‌(48) మృతిచెందాడు. పురుషుల రోడ్‌ రేస్‌ సీ4-5 విభాగంలో బాహ్మన్‌ పాల్గొన్నాడు. సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని రియోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందని ఇంటర్నేషనల్‌ పారాలింపిక్స్‌ కమిటీ(ఐపీసీ) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారాలింపిక్స్‌లో ఇలా ఒక అథ్లెట్‌ మరణించటం మొదటిసారని..ఇలా జరగటం చాలా బాధాకరమని అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయిన బాహ్మన్‌ 2002 నుంచి సైక్లింగ్‌లో పాల్గొంటున్నాడు. 2012 లండన్‌ పారాలింపిక్స్‌లో పాల్గొన్నాడు. సైక్లిస్టు మృతిపై ఇరాన్‌ పారాలింపిక్స్‌ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.బాహ్మన్‌కు నివాళిగా రియో క్రీడాగ్రామంలో ఆ దేశ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆదివారం జరగబోయే ముగింపు వేడుకల్లో సంతాప సూచకంగా మౌనం పాటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com