నేడు 'భెల్' కు శంకుస్థాపన చేయనున్న ఏ.పి ముఖ్యమంత్రి
- September 18, 2016
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిమ్మకూరు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సంయుక్త కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మండలంలోని నెమ్మలూరులో భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్(బెల్) సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ నైట్‌విజన్ ప్రోడక్ట్స్ కర్మాగారం శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు కర్మాగార నిర్మాణానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారని, ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి బెల్ ప్రతినిధులు, అధికారులు సమస్వయంతో పనిచేసి పనులను పూర్తి చేయాలన్నారు.
ముఖ్యమంత్రి విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుంటారని, సభాస్థలికి చేరుకునే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇదేవిధంగా భూమిపూజ, శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిని పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు తరలి వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహార సౌకర్యాలను సమకూర్చాలన్నారు.
పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసి, బారికేడ్లు నిర్మించాలని పోలీసు అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







