వందరూపాయల కోసం 42 బస్సులను తగులబెట్టిన మహిళ
- September 18, 2016
ఓ మహిళ కేవలం బిర్యానీ, వందరూపాయల కోసం 42 బస్సులను తగులబెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరి జలవివాదంపై నిరసనగా సెప్టెంబరు 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్ పోర్టు ఆపరేటర్ కు చెందిన 42 బస్సులను దహనం చేశారు. బెంగళూరుకు చెందిన సి. భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వందరూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. రోజూ వారీ కూలీ అయిన భాగ్య పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.కావేరి జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతోపాటు వందరూపాయలు ఇస్తారని భాగ్య వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. భాగ్యతో పాటు మరో 11మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బస్సుల దహనం, నిరసన ఆందోళన కార్యక్రమంలో నిందితులైన 400 మందిని అరెస్టు చేసినా, బస్సుల దహనం కేసులో భాగ్య ప్రమేయం ఉందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







