కిందపడిపోయిన ప్రభుదేవా !
- September 19, 2016
బుల్ బాడీతో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన డ్యాన్సర్ ప్రభుదేవా. పెద్ద పెద్ద స్టార్స్ కుడా తమతమ సినిమాల్లోని పాటలకుప్రభుదేవాతోనే కంపోజ్ చేయించుకోవాలని కోరుకుంటారు. అంతటి క్రేజ్ ఉన్న ప్రభుదేవా నటుడిగా, దర్శకుడిగా కూడా రాణించాడు. అయితే, ముంబైలో సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ప్రభుదేవా కింద పడిపోయాడట. అసలేంజరిగిందంటే, ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా 'భినేత్రి' తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది. సోనూసూద్ మరియు ఇతర నటులపై, 350 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్న మయంలో ప్రభుదేవాకు వెన్నునొప్పి వచ్చింది.ఒక్కసారిగా కిందపడిపోయిన ప్రభుదేవాను చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్చారు. ప్రభుదేవాను పరీక్షించిన డాక్టర్, ఈ సమయంలో ప్రభుదేవా కి విశ్రాంతి అవసరమని, కొన్ని రోజులపాటు షూటింగ్ లో పాల్గొనవద్దని చెప్పాడట. దీంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ పడినట్లు అయింది. ప్రభుదేవా తొందరగా కోలుకొని, షూటింగ్ లో పాల్గొంటాడని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









