ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్

- September 19, 2016 , by Maagulf
ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్ లో బంపర్ ఆఫర్ ధరలను ప్రకటించింది. రూ. 900 ప్రారంభ ధరలతో విమాన చార్జీల్లో ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కొచీ-తిరువంతపురం, జైపూర్-ఢిల్లీ, గౌహతి-బాగ్డోగ్రా, చండీగఢ్-శ్రీనగర్ తదితర మార్గాల్లో, లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

హైదరాబాద్-కోయంబత్తూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గాల మధ్య ప్రారంభ ఛార్జీలురూ1,299లు, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల మధ్య రూ. 3,199 ప్రారంభమవుతాయి. అలాగే హైదరాబాద్- గోవా మధ్య రూ.1,699 లు, ఢిల్లీ - వడోదర మధ్య రూ.2,599లుగా ను ఇండిగో ప్రకటించింది.

అయితే ఎప్పటినుంచి ఎప్పటిదాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే వెబ్ సైట్ చెక్ చేసినపుడు విభిన్న మార్గాల్లో ఈ నెలనుంచి వచ్చే ఏడాదిదాకా వర్తించనున్నట్టు తెలుస్తోంది. 
కాగా దేశీయ విమానయానంలో గత కొన్నేళ్లుగా డిమాండ్ భారీగానే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ జూలైలో 26 శాతానికి పైగా డిమాండ్ పెరుగుదల నమోదైనట్టు విశ్లేషకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com