ఆరోగ్యానికి మాంసకృత్తుల అవసరం ఎంత?

- August 08, 2015 , by Maagulf
ఆరోగ్యానికి మాంసకృత్తుల అవసరం ఎంత?

మన శరీరానికి మాంసకృత్తు అవసరం చాలా ఉంది. శరీరం సజావుగా నడవడానికి మన వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి, మనం చేసే పనిని బట్టి ఈ మాంసకృత్తుల అవసరం ఎంతైనా ఉంది. మాంసకృత్తులు అంటే కేవలం జంతుసంబంధమైన ఆహరం అయిన మాంసం, గుడ్డు, చేపలు వంటివి మాత్రమే కాకుండా పప్పులు, తృణధాన్యాలూ, చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, గర్భిణులు, కష్టపడి పనిచేసేవారికి వీటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది.మన శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు జంతు సంబంధ మాంసకృత్తుల నుండి దండిగా లభిస్తాయి. అంటే మాంసాహారులకు వీటి పోషణ బాగానే ఉంటుంది. కానీ మరి శాఖాహారుల్లో ఎలా? అంటారా..శాఖాహారులైతే తమ ఆహారంలో కంది, శెనగపప్పు, గోధుమలు, తృణధాన్యాలు, సజ్జలు, జొన్నలు వంటి వాటిని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిలో మాంసాహారంలో ఉండే అమైనో ఆమ్లాలు అన్నీ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు సాంప్రదాయంగా మనం తినే పప్పు అన్నం, ఇడ్లీ సాంబారు మొదలగు వాటి ద్వారా మాంసకృత్తులు మన శరీరానికి అందుతాయి. స్నాక్స్‌ కోసం ఫాస్ట ఫుడ్‌ వైపుకు పరుగులు తీయకుండా మొలకెత్తిన గింజలు, వేరుశనగపప్పు టిక్కీలాంటివాటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా శక్తినిచ్చే మాంసకృత్తులు కూడా దండిగా లభిస్తాయి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com