ప్రభాస్ తదుపరి చిత్రం మూడు భాషల్లో..!
- September 21, 2016
అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందింది 'బాహుబలి'. అందులో నటించిన తారాగణానికి జాతీయ స్థాయి గుర్తింపొచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. 'బాహుబలి - ది కన్‌క్లూజన్'తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోనుంది. ఆ క్రేజ్‌ని అలాగే కొనసాగించేలా ప్రభాస్ తన తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. యూనివర్సల్ సబ్జెక్టుల్ని ఎంచుకొంటూ ఆ సినిమాల్ని దక్షిణాదితోపాటు, హిందీకీ తీసుకెళ్లాలనుకొంటున్నారట. ప్రభాస్ తదుపరి సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.ఆ చిత్రాన్ని మొదట తెలుగులో మాత్రమే తీయాలనుకొన్నారు. కానీ 'బాహుబలి'తో లభించిన గుర్తింపు దృష్ట్యా ప్రభాస్ అండ్ టీమ్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీల్లోనూ స్క్రిప్టుల్ని సిద్ధం చేసి మూడు భాషల్లోనూ తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నారట. బాలీవుడ్ స్టైల్‌లో సుమారు రూ: 100 కోట్ల వ్యయంతో ఆ చిత్రం రూపొందనున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









