కాందశీకులకు మద్దతుగా సౌదీ అరేబియా
- September 21, 2016
న్యూయార్క్: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయిఫ్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా కాందశీకులకు మద్దతుగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాల్ని అందించేందుకు కృషి చేస్తుందని యూఎన్ సమ్మిట్‌లో తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి కాందశీకుల్ని ఆదుకునేందుకుగాను కింగ్ సల్మాన్, 75 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రిన్స్ మొహమ్మద్ తెలిపారు. కింగ్డమ్లో 2.5 మిలియన్ సిరియన్లు ఉన్నారనీ, వారెవరూ కాందశీకుల్లా చూడబడటంలేదనీ, వారికి ఉచితంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సౌకర్యాలు అందుతున్నాయని, ఉద్యోగాల్లోనూ వారికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. యెమెన్ నుంచి వచ్చేవారిని విజిటర్స్లా చూస్తూ, వారికి తగిన సౌకర్యాల్ని కల్పిస్తున్నామనీ నివాసం ఉండేందుకు, పనిచేసుకోడానికి కొన్ని నిబంధనల నుంచి వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రిన్స్ మొహమ్మద్. ప్రపంచ వ్యాప్తంగా 65 బిలియన్ మంది తమ స్వదేశాల్ని విడిచి కాందశీకుల్లా బతికేందుకు ప్రయత్నిస్తున్నారనీ, వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం ప్రపంచం బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









