శలాలహ్ భారతీయ సోషల్ క్లబ్ హార్థిక సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి
- September 21, 2016
మస్కట్ - ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇంద్ర మణి పాండే శలాలః పర్యటనలో భారత సంఘ క్లబ్ నిర్వహించిన ఒక హార్థిక సమావేశంలో ఈద్ అల్ అధా, ఓనం, దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుక క్లబ్ అతని మెజెస్టి సుల్తాన్ కబూస్ బహుళార్ధక మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా 10 వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ సి బి ఎస్ సి పరీక్షలలో రాణించిన క్లబ్ సభ్యులు విద్యార్థులని సత్కరించారు.చైర్మన్ మన్‌ప్రీత్ సింగ్ గౌరవనీయ హెచ్ ఇ పాండేని ఘనంగా స్వాగతించారు. అతను శలాలః ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆహ్వానించబడ్డారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఒకటేనని విదేశాలలో ఉన్నా...ఐక్యంగా ప్రజలు ఒక సమాజంగా ఏర్పడి ఈ పండుగలు జరుపుకునే విధానం ఒక మంచి సంస్కృతి అని అన్నారు. ఇటీవల పదవ తరగతి పరీక్షలలో మరియు పన్నెండవ తరగతులలో విశేష ప్రతిభని చూపిన విద్యార్థులను ఆయన అభినందించి సత్కరించారు. రాయబారి పాండేకు మన్‌ప్రీత్ సింగ్ పూలగుత్తి మరియు జ్ఞాప్తికను అందించారు. హరిద్య మీనన్, లేడీ కోఆర్డినేటర్ శుష్మ పాండే రాయబారి భార్యకు పూలగుత్తి సమర్పించారు.లాయర్ మహ్మద్ అల్ బాదామి దౌత్యవేత్తకు జ్ఞాపకని సమర్పించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







