ఇరాక్ లో 300 మంది ఉద్యోగులను చంపిన ఐసిస్

- August 09, 2015 , by Maagulf
ఇరాక్ లో 300 మంది ఉద్యోగులను చంపిన ఐసిస్

ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగపడ్డారు. ఏకంగా 300 మంది ఆ దేశ పౌరుల్ని దారుణంగా హత్యచేశారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇరాక్‌ సుప్రీం ఎలక్టోరల్‌ కమిషన్‌లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్‌ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నినెవెహ్‌ ప్రావిన్స్‌లోగల మోసూల్‌లో 50 మంది మహిళలను చంపారు. కమిషన్‌లో పని చేస్తున్న మొత్తం 300 మందిని చంపారని అధికారులు తెలిపారు. మరికొన్న చోట్ల కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కమిషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంటనే అంతర్జాతీయ, మానవహక్కుల సంఘాలు కల్పించుకొని ఈ దాడుల నుంచి ఇరాక్‌ పౌరుల్ని కాపాడాలని కోరారు. తమ కుటుంబసభ్యులను హతమార్చినట్లు ఉగ్రవాదులు ప్రకటించారని, అయితే వారి మృతదేహాలను మాత్రం అప్పగించలేదని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. మోసూల్‌పై పట్టుసాధించిన ఐఎస్ ఉగ్రవాదులు.. ఉత్తర ఇరాక్‌లోని ఇతర నగరాలను అక్రమించుకునేందుకు ఈ రకమైన దాడులకు దిగుతున్నారు. అఫ్ఘాన్‌లో పేలుడు: 22మంది మృతి ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో శనివారం అర్ధరాత్రి కారు బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందారు. ఖాన్ అబాద్ జిల్లాలో ఓ మిలిటెంట్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com