వడ్రంగి తెలివి

- August 09, 2015 , by Maagulf
వడ్రంగి తెలివి

ఆ ఊరిలో రాముడు, భీముడు అన్నదమ్ములు. వీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరు మాటను మరొకరు గౌరవించుకుంటూ మంచి అన్నదమ్ముల్లా ఊరిలో పేరు తెచ్చుకున్నారు. ఎటువంటి బేదాభిప్రాయాలు లేకుండా కలిసి మెలిసి వ్యవసాయం చేసుకునేవారు. అలాంటి వారిద్దరి మధ్య అనుకోకుండా పొరపొచ్చాలు ఏర్పడడంతో ఒకరి ముఖం మరొకరు చూసుకోలేనంతగా విడిపోవడం జరిగింది. ఒకరోజు రాముడు మంఛంపై పడుకుని తమ్ముడి గురించి ఆలోచిస్తూ ఉండగా ఎవరో తన ఇంటి తలుపు తట్టినట్లయ్యింది. వెళ్లి చూడగా ఒక వడ్రంగి వచ్చి ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడిగాడు. అందుకు రాముడు పనీ గినీ ఏమీ లేదు వెళ్లిపోండి అని విసురుగా తలుపు వేశాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన తట్టింది. తలుపు తెరచి ఆ వడ్రంగిని పిలిచి ఇదిగో అది మా పొలం. ఆ పొలంలో ఒక పెద్ద గుంత ఉంది. దాని మీద నుంచి ఒక పెద్ద కంచె కట్టాలి. అది కూడా తొందరలోనే జరగాలి. నేను రేపు ఊరికి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి నాకు నా తమ్ముడి ముఖం కనబడకుండా ఆ కంచె సిద్ధం కావాలి అన్నాడు. అందుకు వడ్రంగి సరేనని నవ్వుతూ తలూపాడు. వెంటనే ఆ పని ప్రారంభించాడు. రాముడు ఊరి నుంచి వచ్చేసరికి చెక్కలతో వడ్రంగి ఒక అందమైన వంతేనను ఆ గుంత మీదుగా అన్నదమ్ముల పొలాలను రెండింటినీ కలిపేలా నిర్మించి ఉంచాడు. అదేంటి ఇలా చేశావు అని అడగడానికి ఆ వంతెన మీదుగా నడచి వస్తున్న అన్నయ్యను చూసి భీముడు అన్న తన ఇంటికే వస్తున్నాడనుకొని వేగంగా నడుచుకుని వచ్చి అన్నయ్యను ఆలింగనం చేసుకున్నాడు. దాంతో రాముడు ఎంతో సంతోషించి తను అడగాలనుకున్న మాటను మనసులోనే ఉంచేసి అక్కడ జరిగిన మార్పుకి కారణం వడ్రంగే కదా అని అతని తెలివికి అన్నదమ్ములు ఇద్దరూ మునుపటిలా కలిసిపోయినందుకు ఎంతో సంతోషించి, వడ్రంగికి తగిన పారితోషికం ఇచ్చి పంపించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com