బంగ్లాదేశ్లో మునిగిన పడవ, 13 మంది మృతి

- September 21, 2016 , by Maagulf
బంగ్లాదేశ్లో మునిగిన పడవ, 13 మంది మృతి

బంగ్లాదేశ్‌లో పడవ మునిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్‌లో దక్షిణప్రాంతంలోని ఒక నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ బలమైన ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మిగితా వారు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు ఏఎస్‌పీ మొటలెబ్‌ హుస్సేన్‌ తెలిపారు. గల్లైంతైన వారిలో 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com