మిస్టర్‌ ఇండియా-2 రాబోతోంది..!

- September 22, 2016 , by Maagulf
మిస్టర్‌ ఇండియా-2 రాబోతోంది..!

బాలీవుడ్‌లో 1987లో వచ్చిన మిస్టర్‌ ఇండియా చిత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ చిత్రమే. అనిల్‌ కపూర్‌, శ్రీదేవి, 'మొగాంబో' అమ్రీశ్‌ పురిలు నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, శ్రీదేవి కలిసి ఆడిపాడిన 'ఐ లవ్యూ..' పాట ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మెదులుతూనే ఉంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా మిస్టర్‌ ఇండియా-2 రాబోతోంది. ఇందులోనూ అతిలోక సుందరి శ్రీదేవే నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే శ్రీదేవి ఈ సినిమాకి కావాల్సిన దుస్తులన్నీ డిజైన్‌ చేయించుకుంటోందని సన్నిహితులు తెలిపారు.
సీక్వెల్‌ విషయమై బోనీ గతేడాదే వెల్లడించారు. మిస్టర్‌ ఇండియాకి సీక్వెల్‌ తీయాలనుకుంటున్నామని కానీ శేఖర్‌ కపూర్‌ మాత్రం సీక్వెల్‌ని డైరెక్ట్‌ చేయరని చక్కటి స్టోరీ కుదిరిన వెంటనే సినిమా ప్రారంభిస్తామని బోనీ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీదేవి బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న మామ్‌ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖితో కలిసి నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com