కువైట్ లో స్టెరాయిడ్స్‌ను వాడుతున్న యువత...
- September 22, 2016
ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు, జాగింగ్, వాకింగ్ వంటివి కొందరు చేస్తుంటారు. మరింకొందరు జిమ్‌కు కూడా వెళ్తుంటారు. అందాకా అయితే ఫరవాలేదు కానీ.. సిక్స్‌ప్యాక్ బాడీ కోసం లేనిపోని తిప్పలు తెచ్చుకుంటున్నారు. శరీర శౌష్టవం కోసం, సిక్స్‌ప్యాక్ బాడీ కోసం కువైట్ యువత స్టెరాయిడ్స్ వాడుతోందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా జిమ్‌లో ఈ స్టెరాయిడ్స్‌ను యువత ఎక్కువగా వాడుతోందని తేలింది. అనాబలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ను జిమ్ సెంటర్లో కువైట్ యువత ఎక్కువగా వాడుతున్నారని పురుషుల ఆరోగ్య వివరాలను ప్రచురించే అంతర్జాతీయ మెడికల్ జర్నల్ తేల్చింది. ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల శరీర సౌష్టవం వచ్చినా చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
మొత్తం 200 మంది కువైట్ యువకులపై ఈ పరిశోధన చేశారు. వారి రక్త నమూనాలను పరిశీలించారు. వీరిలో 80 శాతం మంది ఈ స్టెరాయడ్స్ వాడుతున్నట్లు తేలింది. ఈ స్టెరాయిడ్స్ వాడకం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ శాతం తగ్గిపోతుందని, తద్వారా భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









