కెనడాలో ఘనంగా బతుకమ్మ పండుగ
- September 26, 2016
కెనడాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (కెనడా) ఆధ్వర్యంలో ఈ నెల 24న టొరంటో(మిస్సిసౌగ) నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 500 మంది హాజరు కాగా, అచ్చమైన తెలంగాణ సంప్రదాయ రీతిలో బతుకమ్మ పండుగను కన్నులపండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. అనంతరం రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా టీడీఎఫ్ కెనడా నిర్వాహకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూనే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖతో అనుసంధానమై ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









