మాల్ ఆఫ్ ఖతార్ 8000 కొత్త ఉద్యోగాలు
- September 27, 2016
ఖతార్: మాల్ ఆఫ్ ఖతార్, 8000 కొత్త ఉద్యోగాల్ని నేషన్ వైడ్‌గా క్రియేట్ చేయనుంది. 500,000 చదరపు మీటర్ల వైశాల్యంలో 500కి పైగా షాపులతో, 100 రెస్టారెంట్లతో అద్భుతమైన మాల్ని 'మాల్ ఆఫ్ ఖతార్' నిర్వహిస్తోంది. దీంట్లో కొత్తగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్ని కల్పించనున్నామని సిఇఓ అహ్మద్ అల్ ముల్లా తెలిపారు. సంప్రదాయ షాపింగ్‌కి భిన్నంగా అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఇచ్చేందుకు మాల్ ఆఫ్ ఖతార్ సంసిద్ధంగా ఉందని ఆయన వివరించారు. కొత్తగా 8000 ఉద్యోగాల్ని కల్పించడం ద్వారా ఖతార్ ఎకానమీ గ్రోత్‌లో తమవంతు భాగం పంచుకోనున్నట్లు వెల్లడించారాయన. మాల్ ఆఫ్ ఖతార్‌లో 19 స్క్రీన్లు గల సినీ ప్లెక్స్తోపాటు, ఐమాక్స్ని కలిగి ఉందనీ, ఈ ఐమాక్స్‌లో 12 ఛానెల్‌తో కూడిన స్పెషల్ సౌండ్సిస్టమ్, అలాగే 4డి ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ డెస్టిసనేషన్గా మాల్ ఆఫ్ ఖతార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









