ఆఫ్గనిస్తాన్ లో దారుణ సంఘటన
- September 27, 2016
పడుకుని ఉన్న 12 మంది సైనికులపై తోటి సైనికులే దాడి చేసి చంపేసిన దారుణ ఘటన ఆఫ్గనిస్థాన్‌లో చోటుచేసుకుంది. కుందుజ్ నగరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ఈరోజు వెల్లడించారు. ఔట్‌పోస్ట్‌లోని ఇద్దరు సైనికులు నిద్రిస్తున్న ఇతర సైనికులపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. దాడికి పాల్పడిన ఇద్దరు సైనికులకు తాలిబన్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయి తిరుగుబాటుదారులతో కలిసినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీన్ని 'ఇన్‌సైడర్ ఎటాక్'గా పేర్కొన్నారు. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు సహా పలు తిరుగుబాటుదారుల గ్రూపులతో ఆఫ్గాన్ ప్రభుత్వ బృందాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







