స్మార్ట్ ఫోన్ నుంచే ఎన్‌ఓల్ కార్డ్ రీచార్జ్
- September 27, 2016
దుబాయ్: దుబాయ్‌లో ఎన్‌ఓఎల్ కార్డుదారులకు శుభవార్త. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) అతి త్వరలో ఎన్‌ఓఎల్ కార్డుల్ని స్మార్ట్ ఫోన్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఆర్టిఎ దీనికి సంబంధించి ఫైనల్ వెర్షన్ అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసే పనిలో ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాప్‌కి ఈ కొత్త విధానాన్ని అనుసంధానం చేస్తారు. అప్‌గ్రెడేషన్ పూర్తయ్యాక ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకునేవారికి ప్రస్తుతం అందే సర్వీసులతోపాటు, కొత్త సర్వీసులు కూడా అందుతాయి. అప్‌గ్రేడెడ్ యాప్ 'నియర్ ఫీల్డ్ కనెక్టివిటీ (ఎన్ఎఫ్సి) ద్వారా పనిచేస్తుంది. ఈ కొత్త అప్‌గ్రేడెడ్ యాప్ ద్వారా ఎన్‌ఓఎల్ కార్డుల్ని స్మార్ట్ ఫోన్ నుంచే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రీచార్జింగ్ మెషీన్లతో తలెత్తుతున్న ఇబ్బందులకు కొత్త విధానం ఎంతో ఉపశమనం కల్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. దుబాయ్ స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్‌లో భాగంగా పలు సేవల్ని వినియోగదారులకు మరింత సులువుగా అందించేందుకు సరికొత్త ఆవిష్కరణల చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







