భారత్ బాటలోనే బంగ్లా, ఆఫ్గాన్, భూటాన్ సదస్సుకు విముఖత వ్యక్తం..
- September 27, 2016
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ హాజరుకావడం లేదు. అయితే ఇప్పుడు భారత్ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా సదస్సుకు విముఖత వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ దేశాలు కూడా సార్క్ సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయించుకున్నాయి.
ఒక సభ్యదేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకుంటోందని అందుకే తాము సార్క్‌కు హాజరుకాలేమని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఈ మేరకు సార్క్‌కు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు బంగ్లాదేశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇదే కారణంతో ఆఫ్గాన్, భూటాన్‌లు కూడా సార్క్‌కు రావడం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో సార్క్ సదస్సులో పాక్ ఒంటరిగా మిగిలిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్ 19వ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అసలు సదస్సు జరుగుతుందో లేదో అన్న సందిగ్ధత ఏర్పడింది. సార్క్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఒక దేశాధినేత రాకపోయినా సదస్సు నిర్వహించడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







