నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమన్ ప్యారెస్ కన్నుమూశారు
- September 27, 2016
ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమన్ ప్యారెస్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు షిమన్ వ్యక్తిగత వైద్యుడు రఫీ వాల్డెన్ వెల్లడించారు. రెండు వారాల క్రితం గుండెపోటు రావడంతో ప్యారెస్ను తెల్ అవివ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
దాదాపు 7 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1959లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తర్వాత ఇజ్రాయిల్‌లోని అన్ని ప్రముఖ కార్యాలయాల్లో పనిచేశారు.
రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ప్యారెస్ .. 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతి కోసం కీలకంగా పనిచేశారు. ఇందుకుగానూ..1994లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







