ఎం.ఎస్.ధోనీ సినిమాపై పాకిస్థాన్ నిషేధం...
- September 28, 2016
పాకిస్థాన్ నటులను తిరిగి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపుపై బాలీవుడ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా పరిశ్రమ అందరినీ సమానంగా ఆదరిస్తుందని, తమ మధ్య అలాంటి అంతరాలు లేవని బాలీవుడ్‌లో కొందరు నటులు ఇప్పటికే ప్రకటించారు. అయితే పాకిస్థాన్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇక మీదట ఏ భారతీయ చిత్రాలను పాకిస్థాన్‌లోని థియేటర్లలో ఆడకుండా నిషేధం విధించింది. ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎం.ఎస్.ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాపై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఐఎమ్‌జీసీ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పాకిస్థాన్‌కు చెందిన సంస్థ ఈ సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది.పాక్ తాజా నిర్ణయంతో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. కశ్మీర్ వివాదం పరిష్కారం అయ్యేదాకా భారతీయ చిత్రాలపై పాకిస్థాన్ నిషేధం విధించాలని సెప్టెంబర్ 23న లాహోర్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ దాఖలు చేసిన లాయర్ అజహర్ సిద్ధిఖీ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా బాలీవుడ్ సినిమాలను రూపొందిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే, పాక్ బ్యాన్ చేసిన ధోనీ సినిమా సెప్టెంబర్ 30న భారత్‌లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







