'కొడి' ఫస్ట్‌లుక్ విడుదల....
- September 29, 2016
ప్రభు సాలమన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'తొడరి' సినిమాతో ధనుష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీపావళికి కూడా ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమయ్యారు. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన 'ఎదిర్‌నీచ్చల్' సినిమా ద్వారా దర్శకుడిగా అడుగుపెట్టారు దురై సెంథిల్‌కుమార్. ఆయన దర్శకత్వంలో ధనుష్ నటించిన కొత్త చిత్రం 'కొడి'. త్రిష కథానాయిక. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఇది. వెట్రిమారన్ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. అందులో రెండు భిన్నమైన గెటప్‌లలో ధనుష్ కనిపిస్తున్నారు.నిండు గడ్డంతో ఉన్న ధనుష్ లుక్ చాలా కొత్తగా అనిపిస్తోంది. 'పుదుప్పేట', 'ఆడుకలం' చిత్రాల్లో ధనుష్ గడ్డంతో నటించినప్పటికీ.. ఇది కాస్త భిన్నంగానే ఉంది. ఇందులో మరో ధనుష్ రూపం 'తంగమగన్'లో మాదిరిగా అనిపిస్తోంది.ఏదేమైనప్పటికీ కమర్షియల్ హంగులతో 'రెట్టై దీపావళి' వినోదాన్ని పంచేందుకు సిద్ధమని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పాటలు, ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







