షార్జాలో అర్ధరాత్రి అపార్ట్మెంట్ ను చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు
- September 29, 2016
షార్జా: అర్ధరాత్రి అగ్ని జ్వాలలు చుట్టుముట్టడంతో ఆ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న డజన్ల కొద్దీ కుటుంబాలను పోలీసులు ఖాళీ చేయించారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం షార్జా లోని అల్ రహదా రోడ్ లోని ఒక నివాస భవనం వద్ద జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై తక్షణమే స్పందించిన మంటలను సివిల్ డిఫెన్స్ దళం నియంత్రణలోకి తీసుకువచ్చారు.
కేంద్ర స్థానం నుంచి సంనం మరియు మువైలేఇహ్ అగ్నిమాపక స్టేషన్లు సంఘటనా స్థలంకు వచ్చి అగ్ని ప్రమాదం నివారించే ప్రయత్నంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికే ఎటువంటి గాయాలు కాలేదని షార్జా పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి ముఖ్య కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సాయుధ దళాల తదుపరి దర్యాప్తు కోసం షార్జా పోలీస్ అగ్ని నిపుణులకు ఈ స్థలాన్ని అప్పగించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







