కొత్త భవనాన్ని ప్రారంభించనున్న అబుదాబీ మలయాళ సమాజం
- September 30, 2016
అబుదాబీ: అబుదాబీ మలయాళ సమాజం, కొత్తగా నిర్మించబడిన భవనాన్ని శుక్రవారం ప్రారంభిస్తోంది. అబుదాబీలో 1969లో అబుదాబీ మలయాళ సమాజం ప్రారంభమైంది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. ముసాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ భవనాన్ని నిర్మించినట్లు అబుదాబీ మలయాళ సమాజం ప్రెసిడెంట్ బి యెసుశీలన్ - తెలిపారు. 2000 మందికి పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. 1000 మందికి సరిపడా సౌండ్ ప్రూఫ్ ఆడియం ఇందులో ఓ ప్రత్యేకత. 250 మందికి సరిపడే మినీ ఆడిటోరియం కూడా ఇందులో ఉంటుంది. లైబ్రరీ, రీడింగ్ రూమ్, మీటింగ్ రూమ్, లేడీస్ వింగ్, రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, పిల్లల కోసం ప్లే ఏరియా ఈ భవనంలో ఏర్పాటు చేశారు. 2 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో భవనాన్ని నిర్మించారు. ఇందులో మలయాళీలు తమ మాతృ భాష అయిన మలయాళంను ప్రమోట్ చేసేందుకు పలు కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ప్రెసిడెంట్ యేసుశీలన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







