షూటింగ్ లో గాయపడ్డ వరుణ్ తేజ్!
- September 30, 2016
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ మూవీ చేస్తున్న వరుణ్ మరో వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాల్షీట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రెండు చిత్రాల షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు వరుణ్. మిస్టర్ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, ఫిదా కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మిస్టర్ మూవీ ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటుండగా, వరుణ్ తేజ్ పై ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరించాడు శ్రీను వైట్ల. ఆ రిస్కీ స్టంట్ లో ప్రమాదవశాత్తు వరుణ్ తేజ్ కిందపడిపోవడంతో చిన్న పాటి గాయాలు అయినట్టు తెలుస్తోంది.వరుణ్ తేజ్ కి పరీక్షలు జరిపిన వైద్యులు, చిన్నపాటి గాయమేనని భయపడాల్సిన పనేమి లేదని చెప్పారట. మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటే వరుణ్ క్యూర్ అవుతాడని వైద్యులు సూచించారట. కాని వరుణ్ తేజ్ డాక్టర్ల మాటను ప్రక్కన పెట్టి షూటింగ్ లో పాల్గొన్నాడని ఇన్ సైడ్ టాక్.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









