ఇంటికి చేరుకొన్న భారత వలసదారులు మళ్ళీ పిలుస్తారేమోనని పీడకలలు
- October 03, 2016
న్యూఢిల్లీ: భారతదేశంని వదిలి వారు సుందర స్వప్నాలతో సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. కానీ ఆ దేశంలో చమురు ధరల తగ్గుదల కారణంగా ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం తర్వాత వేలాది మంది పేద వలస కార్మికులు వారి కలలు కల్లలు అయ్యాయి. .
భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుంచి కార్మికులు వారి వారి ఉద్యోగాలు కోల్పోయిన తరువాత వారి స్వేదేశాలకు చేరుకొనేందుకు , కనీసం ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు తగినంత డబ్బు లేకుండా నిరాశ్రయులైన మిగిలారు. ఈ వారం చివరికి భారతదేశంలోని తూర్పు రాష్ట్రమైన బీహార్ కు చెందిన 40 మంది పెద్ద కార్మికులు చనిపోయే పరిస్థితులలో ఎట్టకేలకు వారి వారి ఇళ్లకు చేరుకొన్నారు. వారి యజమాని సౌదీ ఓగెరు , లెబనాన్ యొక్క బిలియనీర్ మాజీ ప్రధాని సాద్ హరిరి నేతృత్వంలో శక్తివంతమైన సంస్థ లో ఉద్యోగాలు పొందినప్పటికీ బాధామయ కథలతో ఇంటికి వచ్చారు. సౌదీ అరేబియాలో చమురు ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో సంస్థ యొక్క పలు ప్రాజెక్టులు రద్దు కావడంతో దాదాపు 50,000 మంది కార్మికులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంపెనీ, సంబంధిత కోర్ నిర్మాణ వ్యాపార నుండి ఆదాయం తగ్గడంతో దెబ్బతింది. "వారు అకస్మాత్తుగా మెస్ (క్యాంటీన్) మూసివేశారు. మూడు రోజుల పాటు మేము త్రాగడానికి కూడా నీరు దొరకలేదు. అదేవిధంగా వారు ప్రాంతంలో కరెంట్ సైతం నిలిచిపోయింది."ఎలక్ట్రీషియన్ ఇమామ్ హుస్సేన్ ఈ వారం న్యూఢిల్లీలో విమానం దిగిన తర్వాత " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి వద్ద వాపోయాడు. "నా గుర్తింపు పత్రాలు నా యజమాని వద్దే ఉండిపోయాయి. వాటిని పునరుద్ధరించబడటానికి అవకాశం లేదు ఎందుకంటే నన్ను సైతం అక్కడ అరెస్టు చేశారు. నరకం కంటే ఘోరంగా ఉంది మా పరిస్థితి అని 27 ఏళ్ల యువకుడు చెప్పారు.
గల్ఫ్ రాష్ట్రాలలో పని కోసం వెళ్లిన పేద ఆసియన్లు లక్షల సంఖ్యలో ఉన్నారని హుస్సేన్ మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నట్లు ఆ దేశాలలో ఎంతో మంది దోపిడీ మరియు వేధింపులకు గురవుతారు. అక్కడ ఏర్పడిన చిక్కులను సరిదిద్దుకోవడంకు ఏ అవకాశం లేని పరిస్థుతులలో నిస్ససహయులుగా మిగిలి ఉంటామని ఎలక్ట్రీషియన్ ఇమామ్ హుస్సేన్ పేర్కొన్నాడు రాజ్యం యొక్క కఫాల విధానం కింద అత్యంత శాతం మంది విదేశీ కార్మికులు, వారి ఒప్పందాలు ముగింపు ముందు వారి యజమాని అనుమతి లేకుండా ఒక కొత్త ఉద్యోగం వెళ్లడం అనేక ఇబ్బందులు పెట్టడం ద్వారా తమ వద్ద నుంచి మరో ఉద్యోగం కోసం వెళ్లనీయకుండా నిలిపివేస్తారు. ఇది వెట్టిచాకిరి కన్నాఘోరం లేదా బానిసత్వ రూపంగా మార్చేస్తున్నారు, హక్కుల సంఘాలు విమర్శలు చేశారు. హుస్సేన్ మరియు అతని తోటి వలస కార్మికులు అనేక రోజులపాటు చవక బారైనా హోటల్ యొక్క గారేజ్ నేలపై దుప్పట్లు పరుచుకొని నేలపై నిద్ర పోయేవారమని మురికిగా ఉండే ఆహారాన్నిబహిరంగంగా కూర్చొని రుచిపచి లేకుండా తినేవారమని నాటి పీడకలలను గుర్తు చేసుకొన్నాడు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు









