'త్యాగాల వీణ' పాటలు విడుదల చేసిన కె.సి.ఆర్

- October 04, 2016 , by Maagulf
'త్యాగాల వీణ' పాటలు విడుదల చేసిన కె.సి.ఆర్

తెలంగాణ కోసం ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన చిత్రం 'త్యాగాల వీణ'. సుమన్‌, శివకృష్ణ, ప్రీతినిగమ్‌, సుమశ్రీ, రాజీ, మధుబాల, ఇంద్ర, రాజీవ్‌, ప్రధానపాత్రధారులుగా నటించారు. ప్రేమ్‌ మూవీస్‌ బ్యానర్‌పై కొత్తపల్లి సతీష్‌ బాబు నిర్మించారు. మిర్యాల రవికుమార్‌ దర్శకత్వం వహించారు. రమేష్‌ ముక్కెర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హైద్రాబాద్‌ సి.ఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ ..ఉద్యమం జరిగిన తీరును భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో రూపొందించడం పట్ల చిత్ర దర్శకనిర్మాతలను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com