పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే పిటిషన్ పై 6,65,769 సంతకాలు ,...

- October 04, 2016 , by Maagulf
పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే పిటిషన్ పై  6,65,769 సంతకాలు ,...

పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండు నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు చేపట్టిన ఆన్ లైన్ పిటిషన్ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు 6,65,769 మంది ఈ పిటిషన్ పై సంతకాలు చేశారని వైట్ హౌస్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 50 వేల మంది సంతకాలు చేశారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ చేపట్టిన సంతకాల సేకరణలో 3,50,000 మంది సంతకాలు చేయడమే రికార్డుగా ఉంది. ఆ రికార్డును ఈ పిటిషన్ బద్దలు కొట్టింది. దీంతో తలలు పట్టుకున్న వైట్ హౌస్ అధికారులు పిటిషన్ ను రద్దు చేశారు.పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబర్ 21న ఈ పిటిషన్ ను వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో చేర్చారు.
30 రోజుల్లో లక్ష సంతకాలు వస్తే అమెరికా అధ్యక్షుడు 60 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఆన్ లైన్ పిటిషన్లలోని 98 శాతం పిటిషన్లపై అధ్యక్షులు స్పందించారు. దీంతో 'పాకిస్థాన్ ఉగ్రదేశం' పిటిషన్ పై ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఉన్న బలూచిస్థాన్ ప్రజలు సైతం తమను పాకిస్థాన్ నుంచి వేరు చేయాలనే డిమాండ్ తో ఒక పిటిషన్ ను వైట్ హౌస్ వెబ్ సైట్ లో సంతకాల సేకరణ చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com