నేటి నుంచి యు.ఏ.ఈ లో పర్యటించనున్న భారత్ ప్రధాని మోదీ

- August 15, 2015 , by Maagulf
నేటి నుంచి యు.ఏ.ఈ లో పర్యటించనున్న భారత్ ప్రధాని మోదీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ)లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అబుదాబీకి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ యుఎఇ నేతలతో వివిధ అంశాలపై చర్చలు జరపడంతో పాటు ఆ దేశ జనాభాలో దాదాపు 30 శాతంగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యుఎఇలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం 34 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1981లో యుఎఇలో పర్యటించారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించాలని ఈ పర్యటన సందర్భంగా యుఎఇ పాలకులకు విజ్ఞప్తి చేయనున్న మోదీ, భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com