శ్రీలంక మెయిడ్‌కి 45,000 సౌదీ రియాల్స్
- October 08, 2016
భారతీయ మహిళ, సౌదీ అరేబియాకి శ్రీలంక పాస్‌పోర్ట్ ద్వారా హౌస్‌మెయిడ్‌గా వచ్చిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలు 14 ఏళ్ళపాటు సౌదీ అరేబియాలో పనిచేస్తూ, తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంది. కేదేశ్వరి సెల్లముత్తు అనే ఈ మహిళ తమిళనాడులోని చెన్నయ్ నుంచి శ్రీలంకకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె శ్రీలంక పాస్‌పోర్ట్‌పై సౌదీ వెళ్ళింది. జరీనా సాలీ పేరుతో ఆమెను కొందరు సౌదీకి పంపించారు. అక్కడే ఆమెతో 14 ఏళ్ళపాటు పనికి కుదిర్చారు. విషయం వెలుగు చూడ్డంతో ఆమెకు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో కేదేశ్వరి సెల్లముత్తుకి 45,000 సౌదీ రియాల్స్‌ని ఇప్పించారు. ఆమె చేసిన పనికి అది వేతనం. శ్రీలంక ఎంబసీ సహాయంతో కేదేశ్వరి బయటపడింది. తనతోపాటు మరికొందరు ఇలాగే శ్రీలంక నుంచి వేరే పేర్లతో సౌదీకి వచ్చారని ఆమె తెలిపింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎంత హేయంగా జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని అధికారిక వర్గాలు చెప్పాయి. సౌదీలో ఉద్యోగాలిస్తామని చెప్పి 25,000 సౌదీ రియాల్స్‌కి బేరం కుదుర్చుకుని, 15,000 సౌదీ రియాల్స్ మాత్రమే చెల్లించి అక్రమ మార్గాల్లో అక్కడికి మహిళలు పంపుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని శ్రీలంక డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ హర్సా డిసిల్వా చెప్పారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







