స్టార్ హీరోల సంక్రాంతి పోటీ ...
- October 09, 2016తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంక్రాంతి అతిపెద్ద సీజన్. రెండు వారాలు సెలవులు ఉండే ఈ సమయంలో ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పోటీ నెలకొనడం టాలీవుడ్ లో ఓ సంప్రదాయం. పండక్కి జరిగే కోడి పందేల్లా.అగ్ర కథానాయకులు తమ సినిమాలతో పరస్పరం ఢీ కొడుతుంటారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చే ఏడాది పెద్ద పండక్కి ఇద్దరు జమాజెట్టీలు పోటీ పడుతున్నారు.వాళ్లే చిరంజీవి, బాలకృష్ణ. తెలుగు తెరపై వీళ్లిద్దరిని దాయాదులుగా అంచనా వేస్తుంటారు. చిరంజీవి 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150', వీవీ వినాయక్ దర్శకుడు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది.తమిళ రీమేక్ చిత్రమిది. కాగా బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చారిత్రక కథాంశంతో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక సినిమాలు సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నాయి. 16 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటుల సినిమాలు పోటీకి వస్తుండటం విశేషం.అప్పట్లో 'మృగరాజు', 'నరసింహనాయుడు' బాక్సాఫీస్ దగ్గర తలపడగా.బాలకృష్ణ పైచేయి సాధించాడు. ఈసారి ఫలితం పండగ సమయమే తేల్చనుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..