ఇ-హెల్త్ సేవలు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ యోచిస్తోంది
- October 12, 2016
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఇ-హెల్త్ సేవలు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలను సైతం ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి పరచనున్నట్లు తెలుస్తోంది.దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రులు, చికిత్సాలయాల్లో ప్రత్యేక ఇ-హెల్త్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్ పర్సన్ కరణ్ సింగ్ తన్వార్ తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో స్మార్ట్ హెల్త్ కేర్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎన్డీఎంసీ ఛైర్మన్ నరేష్ కుమార్ తెలిపారు. మోతీ బాగ్ లోని చరక్ పాలిక ఆస్పత్రిలో కొత్త బ్లాక్ శంకుస్థాపన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఎన్ఐసీ సహకారంతో ఎన్డీఎంసీ క్లౌడ్ బేస్డ్ ఇ-హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనుందని, ఈ తరహా సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం దేశంలోనే మొదటిసారి అని ఆయన తెలిపారు. చరక్ పాలికా ఆస్పత్రిలో అదనంగా నిర్మిస్తున్న బ్లాక్ లో అన్ని సౌకర్యాలతోపాటు, జీవరసాయన పరిశోధనలకు వీలుగా పాథాలజీ కమ్ బయో కెమిస్ట్రీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నరేష్ కుమార్ తెలిపారు. ఒక సంవత్సరం వ్యవధిలో మొత్తం 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







