ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్
- October 12, 2016
ఒమన్: ఒమన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ నవంబర్ 7కి వాయిదా వేసింది. ఇద్దరికీ 2,000 రియాల్స్ (5,195) పూచీ కత్తు సమర్పించిన తర్వాత బెయిల్ వారికి మంజూరయ్యింది. ప్యారిస్‌కి చెందిన మీడియా రైట్స్ గ్రూప్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్), జరీమానాని 50,000 రియాల్స్ (130,000 డాలర్లు) నుంచి చాలా ఉపశమనం కల్పించినట్లు పేర్కొంది. అజ్మన్ న్యూస్ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఇబ్రహీమ్ అల్ మామారి, డిప్యూటీ చీఫ్ యూసుఫ్ అల్ హజ్‌లకు మూడేళ్ళ జైలు శిక్ష గతంలో ఖరారయ్యిందనీ, వారు గత సోమవారం విడుదలయ్యారని ఈ కేసులో మరో నిందితుడు జహెచ్ అల్ అబ్రి చెప్పారు. అబ్రి ఏడాదిపాటు జైలు శిక్షకు గురయ్యారు, 1,000 రియాల్స్ ఫైన్ ఈయనకూ విధించారు. ఆగస్ట్‌లో ఈయన్ని బెయిల్‌పై విడుదల చేశారు. వీరి అరెస్ట్ తర్వాత ఆ న్యూస్ పేపర్ పూర్తిగా మూతపడింది. జ్యుడీషియరీలో అవినీతి గురించి రాసిన వ్యాసమే వారి అరెస్టులకు కారణం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వర్గాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఇంటర్వ్యూని ప్రచురించడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







