మనుషుల అక్రమ రవాణా: గ్యాంగ్ అరెస్ట్
- October 12, 2016
మనామా: హౌస్‌మెయిడ్ తప్పిపోయిన ఘటనలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం వెలుగు చూసింది. నార్తరన్ గవర్నరేట్‌లో ఓ ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్న హౌస్‌మెయిడ్ అపహరణకు గురైంది. ఆమెను ఓ గదిలో కొందరు దుండగులు బంధించారు. ఆమె ఉన్న ప్రాంతంలో అన్ సెక్యూర్డ్ వైఫై కనెక్షన్ ఉండటంతో, దాని సాయంతో ఆమె తన స్నేహితులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను కనుగొని, రక్షించారు. బాధితురాలిని ఓ మహిళ నేర్పుగా తన వద్దకు రప్పించుకుని, మంచి జీతానికి పని ఇస్తానని చెప్పి, వ్యభిచారం చేయాల్సిందిగా ఆమెను బలవంతపెట్టినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్న గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







