భిన్నమైన పాత్రలు పోషిస్తూ వావ్ అనిపిస్తున్న అయిదుగురు స్టార్స్..
- October 13, 2016
టాలీవుడ్ లో ఓ కొత్త ఒరవడి సృష్టించారు అయిదుగురు స్టార్స్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని , బాహుబలి ప్రభాస్..తమ మూస పాత్రలనుంచి బయటపడి సరికొత్త రోల్స్ తో ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు. భిన్నమైన పాత్రలు పోషిస్తూ వావ్ అనిపిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీలో తన రోల్ తో బాలయ్య తన ఇమేజ్ ని రీ-డిఫైన్ చేసుకున్నాడు. ఈ టీజర్ రిలీజ్ కాగానే.. ఆయన తన మేకోవర్ ని ఎంతగా మార్చేసుకున్నాడో అర్థమవుతుంది.బాలకృష్ణ లాంటి మాస్ హీరోని జాతీయ అవార్డు పొందిన క్రిష్ వంటి దర్శకుడు ఎలా మార్చేశాడో ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రొమాంటిక్ పాత్రలనుంచి నేనొక్కడినే సినిమాతో బయటపడ్డాడు.యాక్షన్ హీరోగా పాపులర్ అయ్యాడు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంచుమించు ఇదే లెవెల్ అందుకున్నాడు. చాకొలేట్ బాయ్ ఇమేజ్ ను తప్పించుకుని సరైనోడు సినిమాతో తను కూడా యాక్షన్ స్టార్ అనిపించుకున్నాడు. నేచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రమణ్యంతో వెరైటీ గా ఆడియెన్స్ ముందుకొచ్చి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇక బాహుబలి మూవీతో ప్రభాస్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిపోయింది. రాజమౌళి అతడిని అద్భుతంగా మలిచేశాడు. ఇక రాం చరణ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రానా, కళ్యాణ్ రాం వంటి నటుల గురించి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







