అబ్దుల్ కలాం కు నివాళులర్పించిన నరేంద్ర మోడీ

- October 15, 2016 , by Maagulf
అబ్దుల్ కలాం కు నివాళులర్పించిన నరేంద్ర మోడీ

భారత మాజీ రాష్ట్రపతి 'మిస్సైల్‌ మ్యాన్‌' ఏపీజే అబ్దుల్‌కలాం 85వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ట్విట్టర్‌ ద్వారా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయ వ్యక్తి అబ్దుల్‌ కలాం అంటూ మోదీ కొనియాడారు.
1931 అక్టోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్‌ కలాం జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయనను ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. మంచి వక్తగానే కాక 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌', 'ఇగ్నైటెడ్‌ మైండ్స్‌' వంటి పుస్తకాలు రాసి గొప్ప రచియితగానూ పేరుపొందారు. 2015 జులై 27న గుండెపోటుతో కలాం కన్నుమూశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com