విల్లా పార్టిషన్‌పై తనిఖీలు ముమ్మరం
- October 17, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్, అక్రమంగా పార్టిషన్ చేసిన విల్లాలపై తనిఖీల్ని ముమ్మరం చేసింది. టెక్నికల్ మానిటరింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ - దోహా మునిసిపాలిటీ ఇబ్రహీమ్ అబ్దుల్లా అల్ హరమి మాట్లాడుతూ, తమ తనిఖీల్లో 26 బిల్డింగ్ రిలేటెడ్ ఉల్లంఘనల్ని గుర్తించామనీ, ఇందులో 12 పార్టిషన్డ్ విల్లాస్‌కి సంబంధించినవి ఉన్నాయని అన్నారు. ఎక్కువగా ఈ పార్టిషన్డ్ విల్లాస్, అల్ నజ్మా, ఉమ్ ఘువైలినా మరియు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవనీ, ఓనర్ 400 ఖతారీ రియాల్స్ జరీమానా (ప్రతి లీనియర్ మీటర్‌కి) చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకో వైపున ఇన్‌స్పెక్టర్స్ పర్మిషన్ లేకుండా తవ్వకాలు జరుపుతుండడం, సరైన భద్రతా చర్యలు లేకుండా చేయడంపై పలు ఉల్లంఘనల్ని గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







