పాస్తా పెరుగు సలాడ్‌

- August 18, 2015 , by Maagulf
పాస్తా పెరుగు సలాడ్‌

పాస్తా పెరుగు సలాడ్‌ 

కావలిసిన పదార్ధాలు 

పెరుగు - ఒక కప్పు 

పాస్తా - ఒక కప్పు 

ఉడికించిన బఠానీలు - ఒక కప్పు 

క్యాబేజీ, క్యారెట్‌ తురుము - పావు కప్పు 

మిరియాల పొడి - ఒక చెంచా 

ఉప్పు - తగినంత 

పచ్చిమిర్చి - రెండు 

కొత్తిమీర - కొద్దిగా 

తయారీ విధానం 

పాస్తాలో సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తాజా పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని బాగా గిలక్కొట్టి, దానిలో సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్‌ తురుమూ, ఉడికించిన బఠానీలు, మిరియాలపొడి, పచ్చిమిర్చి ముక్కలూ, వేసి బాగా కలపాలి. చివరగా ఇందులో ఉడికించిన పాస్తా వేసి కలిపి, పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే పాస్తా పెరుగు సలాడ్‌ రెఢీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com