కోతి ఇచ్చిన కొంటె సలహా
- August 18, 2015
ఒక అడవిలో ఒక జింకల గుంపు ఉండేది. అదే అడవిలో ఒక కొండ దగ్గర ఉన్న ఏటిలోని నీళ్లంటే వాటికి చాలా ఇష్టం. ఆ ఏటిలోని నీటిని తాగి ఆ జింకల గుంపు ఆనందంగా జీవించేవి. కొన్నాళ్లకి ఆ ఏటిలోని నీళ్లు తగ్గిపోతూ వచ్చింది. దాంతో ఆ జింకల గుంపుకు బెంగ పుట్టుకొచ్చింది. కనబడిన జంతువులన్నింటినీ ఏటిలోని నీరు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆడుగుతూ ఉండేవి. వాటికి సమాధానం తెలీక ఊరికే వెళ్లిపోయేవి. ఒకరోజు జింకలకు ఒక కోతి కనిపించింది. కోతితో తమ బాధ చెప్పుకున్నవి జింకలు. జింకల బాధ కోతికి సరదాగా అన్పించింది. మనసులో చిన్నగా నవ్వుకుని వీటిని ఆటపట్టిద్దామనుకుని ఈ అడవికి తూర్పువైపుగా ఒక పెద్ద రాళ్ల గుట్ట ఉంది. అక్కడ ఏటిలో ఎప్పుడూ నీళ్లుంటాయి అని వాటితో వేళాకోళంగా చెప్పింది. పాపం నిజంగానే బాధలో ఉన్న జింకలు అది నిజమనుకుని అక్కడికి వెళ్లి చూడగా అక్కడ రాళ్ల మద్యన ఉన్న గుహలో ఉన్న పులి ఒకటి ఈ జింకల మందను చూసి వీటిపై ఎగబడింది. దాని నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అంటూ అతికష్టంపై తిరిగి తమ చోటికి చేరుకున్న జింకలు కోతిని వెతుక్కుంటూ వచ్చి, మా బాధ నీకు వేళాకోలంగా అన్పించిందా అని కోతి మీద దాడి చేయబోయాయి. దాంతో భయపడి చెట్టుపైకెక్కిన కోతి మరి మీ అమాయకపు ఆలోచనకు ఎవరికైనా అలాగే అన్పిస్తుంది. వేసవిలో నీళ్లు తగ్గిపోక పోతే పెరుగుతాయా ఏంటీ? అందుకే ఎవరినైనా సలహా అడిగే ముందు కొంత బుర్రపెట్టి ఆలోచించాలి అని మళ్లీ ఉచిత సలహా ఇచ్చింది. తమ అమాయకత్వానికి సిగ్గుతో తలవంచుకున్నాయి జింకలు. ఎవరి సలహా అయినా పాటించే ముందు కొంచెం సేపు ఆలోచించుకోవాలి అని వాటికి తెలిసి వచ్చింది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









