డిజిటల్ హక్కుల కోసం బిడ్
- October 18, 2016
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న ఆదరణే వేరు. సాధారణ ఆటగాళ్లను అసాధారణ క్రికెటర్లుగా మలిచిన ఈ టోర్నీలో అడుగుపెట్టాలని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ ఎదురు చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్-10 డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ వర్గాలు సైతం దీనిని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.
పోటీలో దిగ్గజ సంస్థలు
ఫేస్‌బుక్‌తో పాటు దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో, అమెజాన్, ట్విట్టర్ డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.
బిడ్డింగ్ పత్రాల ఖరీదు రూ.6.6 లక్షలు (10,000 డాలర్లు). పత్రాల కొనుగోలుకు అవసరమైన డబ్బును ఫేస్బుక్ బీసీసీఐకి బదిలీ చేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. బిడ్డింగ్ ముగిసే అక్టోబర్ 25నే హక్కులు దక్కించుకొన్నది ఎవరో ప్రకటిస్తారు.
తిరుగులేని ఆదరణ
గ్రామాల్లోనూ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో భారత్‌లో డిజిటల్ మీడియాకు అద్భుత ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో ఈ మాధ్యమంలో క్రికెట్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య ఎక్కువే. ఐపీఎల్-9 సీజన్లో ఐపీఎల్, 8 జట్ల ఫేస్బుక్ వీడియోలను 14 కోట్ల మందికి పైగా వీక్షించారు. సీజన్లో ఐపీఎల్ ఫేస్బుక్ పేజీని కొత్తగా అనుసరించే వారు 20 లక్షల మంది చేరారు. దీంతో మొత్తం ఫాలోవర్లు 1.83 కోట్లకు చేరారు.
మరో వైపు మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్యకు కొదవలేదు. ప్రతి పది మంది ట్విట్టరటీల్లో తొమ్మిది మంది క్రికెట్‌కు సంబంధించినవే.భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా ఇంప్రెషన్స్ లభించగా ఐపీఎల్-9కు 1.06 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయి. 2015తో పోలిస్తే 56% పెరగడం విశేషం. కాగా మీడియాలో వస్తున్న వదంతులపై స్పందిచమని ఫేస్బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









