క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో పనిచేయని కొత్త కరెన్సీ

- October 18, 2016 , by Maagulf
క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో పనిచేయని కొత్త కరెన్సీ

మనామా: కొత్త 10, 20 బహ్రెయినీ దినార్స్‌ కరెన్సీ నోట్లు క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో పనిచేయడంలేదు. దాంతో బహ్రెయినీ బ్యాంకులు రంగంలోకి దిగి, పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని బ్యాంకులు వెల్లడిస్తున్నాయి. కొత్త నోట్లకు సంబంధించ ఈ సమస్య తలెత్తిందనీ, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో సమస్యలున్న దరిమిలా, బ్యాంకు శాఖల్ని వినియోగించుకోవాల్సిందిగా వినియోగదారుల్ని బ్యాంకులు కోరుతున్నాయి. ఈ సమస్య గురించి వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం అందిస్తున్నట్లు బ్యాంకుల అధికారులు చెప్పారు. మరిన్ని భద్రతా ఫీచర్యలతో కొత్త కరెన్సీ నోట్లను ఇటీవలే బహ్రెయిన్‌లో విడుదల చేయడం జరిగింది. కొత్త నోట్లు విడుదలైనప్పటికీ పాత నోట్లు ఇంకొన్నాళ్ళు చెల్లుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com