కేరళలో యూఏఈ కాన్సులేట్ ప్రారంభం
- October 20, 2016
కేరళలో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభమయ్యింది. జమాల్ అల్ జాబి, కేరళలో యూఏఈ కాన్సుల్ జనరల్‌గా నియమించబడ్డారు. ఇండియాలో ప్రారంభించిన రెండవ కాన్సులేట్ ద్వారా ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కొత్త కాన్సులేట్ కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సత్సంబంధాలు ఇంకా బలపడ్తాయనీ, అలాగే సామాజిక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడ్తాయని ఆకాంక్షించారు జమాల్ అల్ జాబి. ఇంటీరియర్ మినిస్ట్రీ సహాయంతో కాన్సులేట్, కేరళను సందర్శించే యూఏఈ పౌరులకు వీసాలను మంజూరు చేయనుంది. అలాగే కేరళ రెసిడెంట్స్‌కి కూడా ఈ సేవలు అందుతాయి. యూఏఈ, ఇండియా సత్సంబంధాలకు కేరళ ముఖ ద్వారంగా మారిందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. కేరళ నుంచి వస్తున్నవారికి యూఏఈలో మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని, అలాగే కేరళతో యూఏఈ బంధం ప్రత్యేకమైనదని యూఏఈ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







