శంకర:రివ్యూ

- October 20, 2016 , by Maagulf
శంకర:రివ్యూ

తాతినేని సత్య ప్రకాష్ దర్శకత్వం లో విడుదలైన శంకరలో హీరో నారా రోహిత్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. రోహిత్, రెజినా కెసెండ్రా జంటగా నటించిన ఈ మూవీ 2011 లో వచ్చిన తమిళ సూపర్ హిట్ మూవీ మౌనగురు కు రీ- మేక్. (ఈ తమిళ మూవీయే కన్నడలో గురుగా 2012 లో విడుదల కాగా హిందీలోనూ అకిర గా వచ్చింది). బ్రీఫ్ గా స్టోరీ లోకి వెళ్తే.. కాలేజీ స్టూడెంట్ అయిన నారా రోహిత్ ఈ సమాజానికి అడ్జస్ట్ కాలేక సతమతమవుతుంటాడు.తన కోపాన్ని అణచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కుల్లో పడుతుంటాడు. అతని ప్రవర్తన అతని తల్లికి గానీ సోదరునికి గానీ నచ్చదు. కొన్ని పరిస్థితుల్లో తన సిటీ నుంచి బయటపడతాడు. ఇక అక్కడి నుంచే రోహిత్ కు సమస్యలు మొదలవుతాయి.బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది. వాళ్ళు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో ఉడాయిస్తారు. అయితే అనుకోకుండా రోహిత్ ఈ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసు నుంచి బయటపడి తనను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడు,, ఈ విషయంలో రెజినా అతనికి ఎలా సహకరిస్తుంది అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే.నారా రోహిత్ కిది ఈ సంవత్సరంలో ఐదో చిత్రం. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద మూవీల్లో నటించిన రోహిత్ కి జ్యో అచ్యుతానంద సక్సెస్ నిచ్చింది. కాగా శంకర సినిమా చాలా కాలం క్రితమే పూర్తయినా.. రిలీజ్ లో జాప్యం జరిగింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com