`రెమో` సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్...
- October 22, 2016
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. సాంగ్‌ను వంశీపైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా..వంశీ పైడి పల్లి మాట్లాడుతూ - "హీరో శివకార్తికేయన్ ను హీరోయిన్‌గా చూపించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడో నాకు తెలుసు. అనిరుధ్ మ్యూజిక్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది.మంచి వ్యక్తులు కలిస్తే మంచి విజయాలు వస్తాయనడానికి రెమో లాంటి సినిమాయే ఉదాహరణ. రెమో తెలుగులో శివకార్తికేయన్‌కు మంచి ఎంట్రీ అయ్యి తెలుగులో కూడా శివకార్తికేయన్ సక్సెస్‌ఫుల్ హీరో కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "దిల్‌రాజు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆయన బ్యానర్‌లో వస్తున్న రెమో సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.దిల్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాతగా నా బ్యానర్‌లో 25 సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. తొలిసారి రెమో ట్రైలర్ చూసి సినిమాను రీమేక్ చేయాలనిపించేంతగా ఇన్‌స్పైర్ అయ్యాను. తమిళంలో ఈ సినిమాను నేను ఒక్కడినే ప్రివ్యూ షో వేసుకుని చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, భాష తెలియదు కదా, కాబట్టి నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, దాని వల్ల వెట్రి థియేటర్‌లో ఆడియెన్స్ మధ్య సినిమా చూశాను. ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయడం చూసి నాలో నమ్మకం ఏర్పడింది.శివకార్తికేయన్ మాట్లాడుతూ - "తెలుగులోరెమో సినిమాను విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్. దిల్రాజుగారి వంటి నిర్మాత టీచర్‌గా ఉండటం వల్ల ఈ రెమో ఎగ్జామ్‌ను మేం అందరం తెలుగులో పాస్ అవుతామని భావిస్తున్నాను" అన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









