హాస్య నటుడు బ్రహ్మానందం దర్శకుడిగా మారుతున్నాడు...

- October 24, 2016 , by Maagulf
హాస్య నటుడు బ్రహ్మానందం దర్శకుడిగా మారుతున్నాడు...

హాస్య నటుడు బ్రహ్మానందం దర్శకుడిగా మారుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమెడియన్‌ గా బ్రహ్మీ నెమ్మదించాడు. ఏడాదికి రికార్డు స్థాయిలో పదిహేను చిత్రాలు చేసిన ఈ హాస్యనటుడు.ఇప్పుడు నటిస్తున్న చిత్రాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. కొత్త హాస్యనటులు రావడం, బ్రహ్మానందం చేసిన సినిమాలు సరిగా ఆడకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. ఏదేమైనా ఏడాదంతా బిజీగా ఉండే బ్రహ్మానందానికి ఇప్పుడే కాస్తంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ సమయంలో తను చేయాలని అనుకుని చేయలేకపోయిన పనులపై దృష్టిపెట్టాడు బ్రహ్మీ. అందులో దర్శకత్వమూ ఉంది. త్వరలో ఈ హాస్యనటుడు తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. టీవీ షోల ద్వారా గుర్తింపుతెచ్చుకున్న తారలు అనసూయ, రశ్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తారని తెలుస్తోంది.ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తారట బ్రహ్మీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com