'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సప్తగిరి..
- October 24, 2016
టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు . అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు.
శివప్రసాద్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్, ఆర్ట్: కుమార్, స్టంట్స్: జాషువా, డైలాగ్స్: రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్: బుల్‌గానిన్, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆడిషనల్ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్, కో ప్రొడ్యూసర్: డా.వాణి రవికిరణ్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







